![]() |
![]() |

ఆహా ఓటిటి వేదిక పై మరో కొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ వేదిక మీద టాప్ తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్ కొత్తగా మొదలై ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ షోకి మంచి లక్ష్మి , వైవా హర్ష జడ్జెస్ గా ఉన్నారు. అలాగే కాకమ్మ కథలు సీజన్ 3 నడుస్తోంది. ఇది కూడా ఫైనల్ కి వచ్చేసింది. అలాగే కుకు విత్ జాతిరత్నాలు కుకింగ్ షో కూడా ఫైనల్ కి వచ్చేసింది. ఇక గతంలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో ఒక కుక్కింగ్ షో టెలికాస్ట్ అయ్యేది. దానికి సుమ హోస్ట్ గా చేసింది. ఈ షో 5 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ షో సరికొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అది కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ పేరుతో పట్టాలెక్కబోతోంది. ఆ పిక్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి.
ఆహా టీమ్ ఈ షోకి సంబందించిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఫన్నీ నోట్స్ కూడా పెట్టింది. " ఇది కేవలం ఒక వంటల కార్యక్రమం కాదు. వంటలు బహు పసందు, వినోదాలతో విందు, మరుపురాని జ్ఞాపకాలతో మనసు నిండు ....
అలాంటి వినోదాత్మకమైన వంటల కార్యక్రమం అమెరికాకు వస్తోంది.
మీరు మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనుకునే వంట, హాస్యం, వేడుక త్వరలో రాబోతోంది. ఆహా వేదికపై వడ్డించడానికి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ త్వరలో మీముందుకు రావడానికి సిద్ధమవుతోంది. " అంటూ పెట్టిన ఫన్నీ నిజంగా బహు పసందుగానే ఉంది.
నెటిజన్స్ ఈ పిక్స్ ని చూసి ఆల్రెడీ ఈ ఎపిసోడ్స్ ఎవరెవరిని ఇన్వైట్ చేయాలో కూడా ఒక మెనూ ప్రిపేర్ చేసేసి రిప్లైస్ లో రాసేశారు. "రీతూ, తనూజ, విష్ణు ప్రియా, నిఖిల్, కావ్య" వీళ్ళను తీసుకురావాలంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి సుమ హోస్ట్ గా చేయబోతున్న ఈ సీజన్ కి ఎవరెవరు వచ్చి వంటలు చేసి విందును, వినోదాన్ని ఎవరు అందిస్తారో చూడాలి.
![]() |
![]() |